Thursday, 15 October 2020

81. Teachings of Annamayya, Importance of Karma

 శ్రీ వేంకటాచలము ( తిరుమల) మహిలో ఉన్నతమైనది. అది బ్రహ్మాది దేవతలకే అపురూపమైనది. ఈ మహిలో నివసించు సకల మునులకూ నిత్యనివాసమైన, పరమ పవిత్రమైన, పుణ్యవంతమైన పరంధామము శ్రీ హరి నిలయమైన శేషాచలము. అట్టి పుణ్య క్షేత్రమైన తిరుమలను భక్తితో దర్శించి తరింతుము గాక! 

చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా? రోగాలడచి రక్షించే దివ్యౌషధమా? ----- అది--- ఓం నమో వేంకటేశాయ. భక్తితో ఈ సిద్ధమంత్రమును  సర్వరోగ నివారిణిగా వినియోగింతుము గాక! 

వినరో భాగ్యము విష్ణుకథ……………

వెనుబలమిదివో విష్ణు కథ 

Listening to the stories of lord Vishnu is a great wealth and it would act as our strength at the background.

---------------------------------------------------------------------------------------------------------

కర్మ

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 


ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.


. "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 


ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 


మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం. 


- మహాభారతం 

----------------------------------------------------------------------------------------------------------------




79. Teachings of Master EK (to work on our own)

 *

It is proved that if we take Rs. 2 by delivering a service worth of Rs.5, we can live happily with our family and charity can also be done in that. ---- Master EK. 


An impure vessel results in contaminated food. Similarly, the defects in the personality of a person results in lack of perceiving the real truth behind any situation. Hence, it is first required to remove ones own defects in their personality. Then only, they can be able to understand the truth behind any situation.

----- Master EK. 

మనస్సు ఇంద్రియాలలో ప్రవర్తించినపుడు ఇంద్రియాలు పనిచేయును. ప్రవర్తింపనపుడు పనిచేయవు. కన్నులు తెరచికొన్ననూ, మనస్సు మరియొక తావున వున్నపుడు కంటికెదురుగా వున్న వస్తువు కనిపించదు కదా! ఇదే ఇంద్రియాలను జయించుటకు మార్గము. ------ Master EK.

ఏకమేవాద్వితీయం బ్రహ్మ. --- There is only one God, but not two in number. HE can be addressed as either Lord Rama/ Krishna/ Buddha/ Christ/ Master CVV/Aravinda Yogi. But, remember that HE is one and the same always. Let's not get confused about this. Let's remember this at all times and behave better with each other.

Creating a new centre of activity to the mind by the aid of company of people with divine magnetism and enjoying their teachings will give an effective and non-violent cutoff from sex. This process is called Brahmacharya. ---- Master EK.

Loop hole in awareness is death. ----- Sanathsujatha.

One whose will is not established is the one, who is lazy in mind and body. ----- Master EK.

నేనే సత్యమును, మార్గమును, జీవమును యైవున్నాను.  ------ I am the Truth. I am the way. I am the life. ------Lord Jesus Christ.

కలియుగమునందు కేశవనామ సంకీర్తనము శ్రేష్టమైనది.  In the age of Kaliyuga, praising the name of the lord Kesava (Vishnu) by the aid of devotional music is the most desirable trait of people.

సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనమ్. ---- Let us always, at all times, at all places think about the almighty lord Sree Hari. 

పద్మముల వంటి కన్నులు గల నీకు ( విష్ణు భగవానునికి) జయము. ---- వైకుంఠ మందలి కోకిలలు. 

ఈ లోకమంతయూ విష్ణు మయమే. ----- వైకుంఠ మందలి గోరువంకలు.

కేశవుని కన్నా వేరెవ్వడునూ లేడు. --- వైకుంఠమందలి చిలుకలు.

Whatever penance you do for your personal development, it is not of that much useful. But if you do penance for the benefit of the world, it brings the blessings of God into your way. ----- Master EK.

కంఠధ్వనిని సమర్థవంతంగా, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్నిర్మాణం చేసుకొనగలరు. Those who maintain  their vocal sound so systematic, rythmic,  and sacred - they get the ability to reconstruct their life as required. ----- Master Kuthoomi. 

ఏసు క్రీస్తు పుట్టే నాటికి నజరత్ అనే శాఖవారు అక్కడ వుండే వారు. వారంతా మరియు ఏసుక్రీస్తు తండ్రి గానీ, తల్లి గానీ ఆజన్మాంతం మద్యమాంసాలను, గ్రుడ్లను మరియు ఉల్లిపాయలను కూడా తినేవారు కాదు. అనగా అంతర్యామి ఒక శరీరం ధరించి జన్మించాలంటే అతడికి తల్లిదండ్రులు కాబోయే వారు గానీ, మరియు పరిసర ప్రాంతప్రజలు గానీ ఎంతటి పుణ్యాత్ములై వుండవలెనో స్పష్టముగా తెలియుచున్నది. ------ Master EK. 

Energy follows thought. ------ Master DJWALKUL. 

Stop thinking about what other people think about you. Start thinking about what other people want from you. This is essentially important to make up of mental health of a human being. ------ Master EK.

In the age of Kaliyuga (the present time), the following are said as the most sacred activities:

Taking bath in river of Ganga, Reading and following Bhagavad-Gita,  Feeding to a black coloured cow, Donating to sacred people (at least to beggars), worshiping of ficus tree ( by treating it as form of lord  Vishnu), worshiping of lord Vishnu and observing fasting on important days like ekadashi.

ఉప్పు బొమ్మను సముద్రపు లోతును కొలవటానికి వుపయోగించినపుడు ఆ బొమ్మ సముద్రపు నీటిలో కరిగిపోయి అసలు బొమ్మ లేకుండా పోతుంది. అట్లే మనయందున్న పరమాత్మను భక్తి, ధ్యానములతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినపుడు మనోలయం జరిగి, నేనే పరమాత్మ అనే అనుభూతి కలిగి, మనోనిశ్చలత, నిత్యానందం కలిగి సర్వజీవులయందూ తననే దర్శించుకొనే లక్షణం కలిగి, తనవారు- ఇతరులు అనే బేధభావంపోయి, స్త్రీ పురుషులనే లింగభేదంపోయి, సర్వజీవులయందూ అకారణంగా పరమ ప్రేమను కలిగి జీవించగలిగే స్థితి వస్తుంది. ఓంకార ఉపాసన ఈ స్థితి పొందడానికి ముఖ్యంగా ఉపకరిస్తుంది.

పరమలక్ష్యము నిమిత్తమే కాయము కానీ, లక్ష్యమును వీడిన కాయము బొగ్గుతో సమానము.  యెట్టి వారికైననూ ఆత్మ తత్వము తెలియనంత వరకే కాయముపై భ్రాంతి వుండును. దేహభ్రాంతి అజ్ఞానము. ఆత్మ భ్రాంతి జ్ఞానము. ---- శ్రీ రామ చంద్రుడు.

గుణశీలములుగల మహనీయుని వద్దకు సంపదలు వేశ్యలవలే వచ్చి పడివుంటాయి. దీనికి లోకసంబంధమైన విద్యలతో ఏవిధంగానూ సంబంధం లేదు. ------ మాస్టర్ ఇ.కె.

మహనీయులు ( ఉత్తములు ) ఇతరులకు దాస్యం చేయడం కాకుండా, ఉన్నతమైన ఆశయాలకు ( higher principles కి) దాసోహం చేస్తారు. ---- మాస్టర్ ఇ.కె. 

శాంతము లేక సౌఖ్యము లేదు. There would be no comfort when there is no peace. ---- Thyagaraja Swamy.

Self control neutralises karma. If the causes of our sickness are controlled, then the disease need not take place. ---- Master EK.

నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా? నిజముగ తెలుపవే మనసా.--- Thyagaraja Swamy. --- Treasure gives happiness? Or the presence of lord Rama gives happiness? O my mind, Let me realise this now. 

Venus is the lord for --- spirit of sacrifice, spirit of giving ( but not taking), realisation of pure love from animal kind of emotions. He acts as Alchemist who purifies love from our emotions with the help of mercury. 



80. Always choose to die empty.....

 




78. Some Yoga Principles.

* Environment is the product of our mind. Hence, make sure that our environment to be good so that our mind would be good.

* I am in you. You do my work ( yoga practice). I will take care of your work. ---- Master CVV.

* Night 0 hrs prayer is the best one. This is why because,  during that time all the planets pointing towards earth.---- Master CVV.

* Happiness, Silence, Peace – They cannot be found in the external world. ------ Master EK.

* Jealousy is mental leprosy. ------ Lord Maitreya.

* Dissatisfaction is a mental disease. ---- Master EK.

* Obstacle mindedness is a mental disease. ----- Master EK.

* Meditate the following Gopala yantram in your mind whenever it is possible, this gives us victory as required in our life:

--------------------------------------------------------------------------------------------------
* Meditate the following Sree chakra yantra in your mind whenever it is possible, get out of stumbling in life. Daily do it and see the results of it:

--------------------------------------------------------------------------------------------------
*

*

Wednesday, 10 June 2020

77. Some Yoga Principles ---4

* మీ ద్రృష్టిని అదుపులో ఉంచుకున్నచో ఈ సృష్టి మీ అదుపులోకి వస్తుంది. అంతర్ దృష్టి అలవరుచుకోవాలి, బాహ్య దృష్టి కాదు.
*  దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు ..????
ఒక పిల్లవాడి కి సందేహం వచ్చి, గురువు గారిని ”దేవుడు మనం పెట్టిన నైవేద్యం తింటాడా, తింటే పెట్టిన పదార్థం ఎందుకు అయిపోలేదు” అని ప్రశ్నించాడు .... గురువు గారు ఏం సమాధానం ఇవ్వకుండా, పాఠాలు చెప్పసాగారు.
ఆరోజు పాఠం
“ ఓం పూర్ణమద: పూర్ణమిదం
పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే” అనే శ్లోకం .
పాఠం చెప్పడం పూర్తయిన తరువాత, అందరిని పుస్తకం చూసి శ్లోకాన్ని నోటికి నేర్చుకొమ్మని చెప్పారు గురువు గారు. కొద్దిసేపటి తరువాత , నైవేద్యం గూర్చి ప్రశ్నించిన శిష్యుడి దగ్గరకు వెళ్ళి నేర్చుకున్నావా అని అడిగారు. నేర్చుకున్నాను అని వెంటనే అప్పచెప్పాడు శిష్యుడు. శ్లోకం సరిగ్గానే చెప్పినప్పటికీ, గురువు గారు తల అడ్డంగా ఆడించారు . దానికి ప్రతిగా శిష్యుడు, కావాలంటే పుస్తకం చూడండి అని గురువు గారికి పుస్తకం తెరచి చూపించాడు. శ్లోకం పుస్తకం లోనే ఉందిగా… నీకు శ్లోకం ఎలా వచ్చింది అని అడిగారు గురువు గారు. శిష్యుడికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. గురువు గారే మళ్ళీ అన్నారు. పుస్తకంలో ఉండే శ్లోకం స్థూల స్థితి లో ఉంది… నువ్వు చదివినప్పుడు నీ బుర్ర లోకి అది సూక్ష్మ స్థితిలో ప్రవేశించింది. ఆదే స్థితి లో నీ మనస్సులో ఉంది. అంతే కాదు, నువ్వు చదీవి నేర్చుకోవడం వల్ల పుస్తకం లో స్థూల స్థితి లో ఉన్న శ్లోకానికి ఎటువంటి తరుగూ జరగలేదు. అదే విధం గా విశ్వమంతా వ్యాప్తి అయి పూర్ణంగా ఉన్న పరమాత్ముడు నైవేద్యాన్ని సూక్ష్మస్థితి లో గ్రహించి, స్థూలరూపం లో ఎటువంటి నష్టం లేకుండా చేస్తాడు . దాన్నే మనం ప్రసాదం గా తీసుకుంటున్నాం. అని వివరణ చేశారు.
* 

76. ఓ నాలుగు మంచి మాటలు

 ఓ నాలుగు మంచి  మాటలు
ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం.

"మౌనం" - "మనస్సు"ని  శుద్ధి చేస్తుంది. "స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది. "ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది. "ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.
      "దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది. "ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది. అలాగే "క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.

ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త.

నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.

సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.

జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.

కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...

"అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు,
      -   చేతినిండా పని ...
      -   కడుపునిండా తిండి..
      -   కంటినిండా నిద్ర...
      -   అవసరానికి ఆదుకునే  ఆప్తులను
కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".

మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్ధమే.

మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా "గౌరవించాలో" తెలుస్తుంది. "నేనే", "నాకేంటి !" అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. "గౌరవమర్యాదలు" ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే "మంచి జీవితం".

నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది.

ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక "విలువ" ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.

నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు.


 జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతుడివి అవుతావు. "వయస్సు" పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.

75. Some Yoga Principles ----- 3

* The wealth you earn is not true wealth! True wealth is the grace of God.

* The Bhagavad Gita asks you to be not Balavaan (possessor of physical prowess), not Dhanavaan (possessor of a comfortable bank balance) but, Atmavaan (having the prowess arising out of the awareness that you are the Atma, which can remain unaffected by fame or shame, grief or joy and all the buffetings of the dualities of the world).

* కాయకు చెట్టే ఆధారంగానీ వేరొక కాయ కాదు కదా అట్లే ప్రతి వ్యక్తికీ భగవంతుడే ఆధారంగా వున్నాడు గానీ వేరొక వ్యక్తి గాదు. మానవులు ఒకరిపైనొకరు ప్రేమ, ఆప్యాయతలు కలిగి వుండవచ్చును గానీ దైవమును మరచి స్వప్రయోజనములకై ఒకరిపైనొకరు ఆధారపడి జీవించుట శ్రేయస్కరము కాదు.
* మానవుని దుఃఖానికి కారణం తనని తాను మరచిపోయి ప్రవర్తించడం. దుఃఖనివ్రృత్తికి కారణం తనని తాను గుర్తించి ప్రవర్తించడమే. ఇది చాలా ముఖ్యమైన విషయం, కావున దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు.
* కామియైననూ, మోక్షగామియైననూ మానవుడు తనను తాను మరచిపోయి ప్రవర్తించరాదు. ---- మఛ్చీంద్ర యోగి.