Thursday 29 October 2020

82. Messages from Bhagavatam.

  •  భక్తియే పూజగాని పుష్పాదిసమర్పణ పూజకాదు. ---- భాగవతం.

  • భగవానుడు సర్వాత్ముడు గనుక పూజనిమిత్తం అతనిని సూర్య, అగ్ని, జలములందు, అతిథి యందు, తనహ్రృదయమందు అధిష్ఠింపజేసి పూజింప వచ్చును. ఆప్రకారం చేసిన వారు శీఘ్ర కాలంలోనే ముక్తులౌతారు. --- భాగవతం.
    • God can be worshipped in sun, fire, water, guest, one's own heart. If any one of these ways are followed, they get self realisation at the earliest possible. --- Bhagavatam.

    • Lord Krishna's presence always available in the temple of Dwaraka which is there inside the sea. By thinking about this temple itself, one gets rid of all sins, and not only that, they get abundant blessings of God. --- Bhagavatam.

    • Satsang (spending time in the presence of holy people / holy spirit -- antaraatma ) is far far better than -- Yoga, Saankhya, Dharma, Swadhya ( holy book reading related to Atma), Tapas (penance), sacrifice, ishtaapurtam, charity, vows, yagnas, mantras, teertha Yatra (touring the holy places), practices of Yama and niyama, and all other sadhanas. Because, to realise ME, true renunciation (Sarva sanga parityagam) is the most essential. ---- Lord Sree Krishna told to Udhava.




    • The key to gaining quiet nature is in following the laws of right relationship and to daily associate with the knowledge of eternity. When these two are coupled with an orderly daily activity one’s nature calms down. The ability to do so depends upon one’s linkage with the objectivity. The linkage could be bondage when it develops obligatory Karma due to one’s own ignorance.   ----Master KT
    • It is proved that if we take Rs. 2 by delivering a service worth of Rs.5, we can live happily with our family and charity can also be done in that. ---- Master EK. 
    • Those who are holy with good character and right behaviour,  for no reason wealth will come and stick to them as if the prostitutes come and stick to the wealthy people. As the holy people have faith only in almighty, they never look worldly pleasures. The reason behind their richness don't include educational background, caste or religion.
    • మన ద్రృష్టినిబట్టి ఈ స్రృష్టి మనకు గోచరిస్తుంది. బాహ్యద్రృష్ఠి గలది పశువు. అంతర ద్రృష్టిగలవాడు మానవుడు. అజ్ఞానం లేకుండా ప్రవర్తించేవాడే మానవుడు.
       కావున ద్రృష్టిని అదుపులో పెట్టుకోవడం ప్రధానమైన సాధన. If you can keep your vision under your control and behave with out ignorance, the creation will come into your control. This is most essential thing to keep in practice now. ------- Bhagwan Sree Satya Sai Baba.
    • మనస్సు ఇంద్రియాలలో ప్రవర్తించినపుడు ఇంద్రియాలు పనిచేయును. ప్రవర్తింపనపుడు పనిచేయవు. కన్నులు తెరచికొన్ననూ, మనస్సు మరియొక తావున వున్నపుడు కంటికెదురుగా వున్న వస్తువు కనిపించదు కదా! ఇదే ఇంద్రియాలను జయించుటకు మార్గము. ------ Master EK.
    • An impure vessel results in contaminated food. Similarly, the defects in the personality of a person results in lack of perceiving the real truth behind any situation. Hence, it is first required to remove ones own defects in their personality. Then only, they can be able to understand the truth behind any situation.
      ----- Master EK. 
    • ఏకమేవాద్వితీయం బ్రహ్మ. --- There is only one God, but not two in number. HE can be addressed as either Lord Rama/ Krishna/ Buddha/ Christ/ Master CVV/Aravinda Yogi. But, remember that HE is one and the same always. Let's not get confused about this. Let's remember this at all times and behave better with each other. 
    • కలియుగమునందు కేశవనామ సంకీర్తనము శ్రేష్టమైనది.  In the age of Kaliyuga, praising the name of the lord Kesava (Vishnu) by the aid of devotional music is the most desirable trait of people.
    • నేనే సత్యమును, మార్గమును, జీవమును యైవున్నాను.  ------ I am the Truth. I am the way. I am the life. ------Lord Jesus Christ. 
    • One whose will is not established is the one, who is lazy in mind and body. ----- Master EK.
    • Loop hole in awareness is death. ----- Sanathsujatha. 
    • Creating a new centre of activity to the mind by the aid of company of people with divine magnetism and enjoying their teachings will give an effective and non-violent cutoff from sex. This process is called Brahmacharya. ---- Master EK.
    • Always proud to be a teacher, and be proud of your noble profession. Happy Teachers day.
    • సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనమ్. ---- Let us always, at all times, at all places think about the almighty lord Sree Hari. 
    • కేశవుని కన్నా వేరెవ్వడునూ లేడు. --- వైకుంఠమందలి చిలుకలు. 
    • ఈ లోకమంతయూ విష్ణు మయమే. ----- వైకుంఠ మందలి గోరువంకలు. 
    • పద్మముల వంటి కన్నులు గల నీకు ( విష్ణు భగవానునికి) జయము. ---- వైకుంఠ మందలి కోకిలలు.
    • Excessive consumption of milk results in rajasic behaviour( nature of dominating  others) -- Bhagwan Sree Satya Sai Baba.
    • Consumption of buttermilk results in satvik behaviour ( polite nature) --- Bhagwan Sree Satya Sai Baba.
    • Dirty thoughts come with fish. So, avoid taking fish. ----- Bhagwan Sree Satya Sai Baba. 
    • Excess of food results in dullness of mind. ---- Bhagwan Sree Satya Sai Baba
    • నిగ్రహమెక్కడో అనుగ్రహం అక్కడే. Where there is  self-control, God's blessing will be there only. ----Bhagawan Sree Satya Sai Baba.
    • కంఠధ్వనిని సమర్థవంతంగా, శ్రావ్యముగ, పవిత్రముగ నిర్వర్తించుకొనువారు తమ జీవనమును పునర్నిర్మాణం చేసుకొనగలరు. Those who maintain  their vocal sound so systematic, rythmic,  and sacred - they get the ability to reconstruct their life as required. ----- Master Kuthoomi.
    • శాంతము లేక సౌఖ్యము లేదు. There would be no comfort when there is no peace. ---- Thyagaraja Swamy.
    • మహనీయులు ( ఉత్తములు ) ఇతరులకు దాస్యం చేయడం కాకుండా, ఉన్నతమైన ఆశయాలకు ( higher principles కి) దాసోహం చేస్తారు. ---- మాస్టర్ ఇ.కె.
    • గుణశీలములుగల మహనీయుని వద్దకు సంపదలు వేశ్యలవలే వచ్చి పడివుంటాయి. దీనికి లోకసంబంధమైన విద్యలతో ఏవిధంగానూ సంబంధం లేదు. ------ మాస్టర్ ఇ.కె. 
    • పరమలక్ష్యము నిమిత్తమే కాయము కానీ, లక్ష్యమును వీడిన కాయము బొగ్గుతో సమానము.  యెట్టి వారికైననూ ఆత్మ తత్వము తెలియనంత వరకే కాయముపై భ్రాంతి వుండును. దేహభ్రాంతి అజ్ఞానము. ఆత్మ భ్రాంతి జ్ఞానము. ---- శ్రీ రామ చంద్రుడు.
    • ఉప్పు బొమ్మను సముద్రపు లోతును కొలవటానికి వుపయోగించినపుడు ఆ బొమ్మ సముద్రపు నీటిలో కరిగిపోయి అసలు బొమ్మ లేకుండా పోతుంది. అట్లే మనయందున్న పరమాత్మను భక్తి, ధ్యానములతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినపుడు మనోలయం జరిగి, నేనే పరమాత్మ అనే అనుభూతి కలిగి, మనోనిశ్చలత, నిత్యానందం కలిగి సర్వజీవులయందూ తననే దర్శించుకొనే లక్షణం కలిగి, తనవారు- ఇతరులు అనే బేధభావంపోయి, స్త్రీ పురుషులనే లింగభేదంపోయి, సర్వజీవులయందూ అకారణంగా పరమ ప్రేమను కలిగి జీవించగలిగే స్థితి వస్తుంది. ఓంకార ఉపాసన ఈ స్థితి పొందడానికి ముఖ్యంగా ఉపకరిస్తుంది.
    • Stop thinking about what other people think about you. Start thinking about what other people want from you. This is essentially important to make up of mental health of a human being. ------ Master EK. 
    • Energy follows thought. ------ Master DJWALKUL.
    • ఏసు క్రీస్తు పుట్టే నాటికి నజరత్ అనే శాఖవారు అక్కడ వుండే వారు. వారంతా మరియు ఏసుక్రీస్తు తండ్రి గానీ, తల్లి గానీ ఆజన్మాంతం మద్యమాంసాలను, గ్రుడ్లను మరియు ఉల్లిపాయలను కూడా తినేవారు కాదు. అనగా అంతర్యామి ఒక శరీరం ధరించి జన్మించాలంటే అతడికి తల్లిదండ్రులు కాబోయే వారు గానీ, మరియు పరిసర ప్రాంతప్రజలు గానీ ఎంతటి పుణ్యాత్ములై వుండవలెనో స్పష్టముగా తెలియుచున్నది. ------ Master EK. 
    • Self control neutralises karma. If the causes of our sickness are controlled, then the disease need not take place. ---- Master EK. 
    • నిధి సుఖమా? రాముని సన్నిధి సుఖమా? నిజముగ తెలుపవే మనసా.--- Thyagaraja Swamy. --- Treasure gives happiness? Or the presence of lord Rama gives happiness? O my mind, Let me realise this now.
    • Venus is the lord for --- spirit of sacrifice, spirit of giving ( but not taking), realisation of pure love from animal kind of emotions. He acts as Alchemist who purifies love from our emotions with the help of mercury. 
    • శ్రీ వేంకటాచలము ( తిరుమల) మహిలో ఉన్నతమైనది. అది బ్రహ్మాది దేవతలకే అపురూపమైనది. ఈ మహిలో నివసించు సకల మునులకూ నిత్యనివాసమైన, పరమ పవిత్రమైన, పుణ్యవంతమైన పరంధామము శ్రీ హరి నిలయమైన శేషాచలము. అట్టి పుణ్య క్షేత్రమైన తిరుమలను భక్తితో దర్శించి తరింతుము గాక! 
    • చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా? రోగాలడచి రక్షించే దివ్యౌషధమా? ----- అది--- ఓం నమో వేంకటేశాయ
      . భక్తితో ఈ సిద్ధమంత్రమును  సర్వరోగ నివారిణిగా వినియోగింతుము గాక! 
    • వినరో భాగ్యము విష్ణుకథ……………
      వినరో భాగ్యము విష్ణుకథ
      వెనుబలమిదివో విష్ణు కథ 
      Listening to the stories of lord Vishnu is a great wealth and it would act as our strength at the background.
    • Restoration of mind to it's original state (only one) is possible by maintaining neutrality in reaction towards the action made by the environment and making action on your own will but not based on the action made by environment. ----- Master EK.
    • When you stand in a room in which several parallel mirrors are arranged, you can see more number of images. But you are only one in number. Even then you are appeared as many. Similarly, when mind is only one in number, but when senses work on it, it appears as 5 reflections. When mirrors are removed, there would be again only one mind. We need to restore the original state of mind (only one but not many).----Master EK. 
    • Don't try to control the breath directly. A controlled mind can control the breath. When equilibrium is established in respiration, then the mind and senses disappear into respiration so that the yoga student can exist with out making exhalation for a longtime. This is all possible through pranayama. ---- Master EK.
    • Through pranayama, health can be re-established in the human constitutions. For this, mind should be naturally kept calm. We can't control mind directly. Regulation of timings of work and perfect daily routine at regular intervals of time leads to disappearance of mind naturally. This is the state we need to establish first. ----- Master EK. 
    • Health of the pulsation depends on the equilibrium of these 2 pulsations ( prana and apana ). As long as we continue with our unwanted emotions such as lust, anger, etc (6 in number), this equilibrium gets disturbed and causing bad health in human constitutions. This is the real cause of bad health, some times, it leads to death. ---- Master EK. 
    • Respiration is caused through 2 pulsations called prana and apana. When prana takes place, oxygen will be taken inside. When apana takes place, CO2 and other excretes such as urine, stool, sweat etc., will be sent out. When we receive information from environment, prana works. When we react with environment, apana works. --- Master EK. 
    • The mind is continuously experiencing only  reflection but not existence (through 5 sensory organs). We should see that our mind should exist but not it's reflection. This is the keynote to establish neutrality toward the reaction to the environment. ----- Master EK. 
    • Your reaction towards the environment should be neutralized, your action towards the environment should be established. This is the practice you are required to do now. ------ Master EK. 
    • Lord said to prophet Moses : 
      ' I accept no second existence. ' 
      But this statement was wrongly written in Holy Bible as:
      ' I, The Lord God am a jealous God.' 
      ఈశ్వరుడనైన నేను ఈర్ష్యాపరుడను. అని కొందరు అసమర్ధులచే ఆంగ్లంలోకి అనువదించబడింది. This is wrong.

      ' నేను తప్ప వేరొకటి యున్నదని ఆమోదించను. ' అని దేవుడు చెప్పాడు. This means that the root of everything/ every person in the creation is the lord only and nothing else. ------ Master EK. 
    • ధ్యానమున ఒకే రూపమును చూచు అభ్యాసము ఇవ్వబడినది. ఈ అభ్యాసము తో సూక్ష్మదేహమున వున్న నీ సభ్యులను గానీ, దివ్య దేహమునవున్న ఒక దేవతను గానీ చూచుటకు ప్రయత్నించినచో క్రమముగా గురుదర్శనము, దైవదర్శనము గూడ కాగలదు. దీని వలన మీ మనస్సునకు అతీంద్రియ శక్తి పెరుగుతుంది. దీని కారణంగా వినబడనివి వినబడుట, కనబడనివి కనబడుట అను మరియొక సిద్ధి కలుగుతుంది. ----- Master Kuthoomi.
    • Evil is always limited, good is always unlimited. 
    • Utter om loudly and listen to its sound, repeat this process for number of times to experience God. --- Master EK.
    • Service is realisation of your want in others. ---- Master EK
    • The time you take to repay your debt determine your character. 
    • Desires born from mind. Happiness will born when there is no desire in the mind. ---- Master EK.
    • Real yoga student will never have seriousness. ---- Master EK.
    • Serve till you forget that you are serving. ---- Master EK. 
    • The moment you start speaking truth as it is existing, the truths existing in the creation will start coming out of your mouth with out your plan.
    • The mind of God is time.
      HIS physical body is the space.
      HIS thought is ether.
      HIS colour is blue. ------ Ashram Leaves.
    • Being untouched by desire is true renunciation. ---- Lord Sree Krishna.
    • When you start living based on truth, then you would be able to understand the relationship between you and this creation. ------- Master meditations.
    • శ్రీ రామ చంద్రా! మీ కటాక్షము వుండిన దుస్సాధ్యములుండవు. ----- హనుమంతుడు. 
    • శ్రీ లక్ష్మి కటాక్షం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ఒకే సమయంలో శ్రీ సూక్తం భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తూ, గోపూజ చేస్తూ వుండవలెను. సత్యవ్రతమును పాటిస్తూ, పరిశుభ్రత పాటించాలి. 
    • వర్తమాన కాలంలో జీవించే వాడికి దైవం నుండి వర్తమానం వస్తుంది. 
      Those who continue to live in present tense ( but not in past or future), they get invitation (plan to be executed) from lord to perform the next intended action.
    • వ్రతములలో బ్రహ్మచర్య వ్రతం రాజు వంటిది. 
      Among all religious vows, celibacy ( Brahmacharya vow) is royal one.
    • కలియుగమున గంగానది, భగవద్గీత, సాధుపుంగవుడు(భిక్షువు), కపిలగోవు, రావిచెట్టు, విష్ణు భగవానుని పర్వదినములు -- ఏకాదశి మొదలగునవి వీటిని మించిన పావనకరములగు వస్తువులు మరియేవి కలవు? 
    • We are ashamed of accepting that we are having problems. There were no problems in the creation. We only created our problems out of our ignorance. ---- Master EK. 
    • కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
      కొండలంత వరములు గుప్పెడు వాడు. 
      O Lord Venkateswara! You reside on seven hills. You  are the koneti raaya in tirumala. You are used to offer great boons to your devotees which no other deity could offer. You are the lord of all. I convey Namaskarams to your lotus feet. 
    • రంగపుర విహార…………
      రంగపుర విహార జయ కోదండ- రామావతార రఘువీర శ్రీ 
      O Lord Sree Ranganatha! You reside in Sree Ranga Pura. You were the lord Sree Rama who carries a bow and arrows to punish wicked people. You are Sree Raghu Veera. We convey our Namaskarams to your lotus feet.
    • వినరో భాగ్యము విష్ణుకథ…………వినరో భాగ్యము విష్ణుకథ,  వెనుబలమిదివో విష్ణు కథ 
      Listening to the stories of lord Vishnu is a great wealth and it would act as our strength at the background.
    • To use the room as the sacred place of meeting where all meet for practice and silent prayer.   No bhajan or any ritualistic prayer or worship should be done.   You must know that ours is the line of true knowledge.------ Master CVV.
    • కర్మ

      కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు.కృష్ణుడిరాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్ళి బోరున విలపిస్తాడు. చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న ధృతరాష్ట్రుడిని కృష్ణుడు ఓదార్చే ప్రయత్నం చేస్తాడు. 

      ధృతరాష్ట్రుడి దుహ్ఖం కోపంగామారి కృష్ణుడిని నిలదీస్తాడు. "అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకి వందమంది పుత్రులని పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు అని నిలదీస్తాడు. అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు.

      . "ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు. ఇది ఇలా జరగటానికి, నీకు పుత్రశోకం కలగటానికీ అన్నిటికీ కారణం నువ్వూ నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు). ఒకరోజు వేటకు వెళ్ళి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోక వృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూట్లో గుడ్లతో నివసిస్తున్నాయి. వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బ్రతుకగా అప్పటికే సహనము నశించినవాడివై కోపంతో ఆ గూట్లో ఉన్న వంద గుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్చిన్నం చేశావు. తమ కంటి ముందే తమ నూర్గురు పిల్లలు విచ్చిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూఉండిపోయాయి. ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపము నుండి విముక్తుడిని చేసి కర్మబంధం నుండి విడిపించింది, నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పక వెంటాడుతుంది, వదలక వెంటాడి ఆ కర్మ ఫలాన్ని అనుభవింపచేస్తుంది. కర్మ నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని అంటాడు. 

      ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్ళీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు. కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు అని ప్రశ్నిస్తాడు. అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి "ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి. ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు. వందమంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పని చేయడం మొదలుపెట్టింది అని శెలవిస్తాడు. అది విన్న ధృతరాష్ట్రుడు కుప్పకూలిపోతాడు. 

      మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఒక్క చెడ్డపనితో తుడిచిపెట్టుకుపోతాయి అని శ్రీ కృష్ణుడు అంతరార్థం. 

      - మహాభారతం 
    • క్షణభంగురమైన, మలినమైన, దుర్గంధములతో, మలమూత్రాదులతో నిండిన ఈ దేహమును యెట్టి వాడైననూ ఒకానొక దినము వీడికి తప్పదు. ఆ కాయము తో సాధించునట్టి కార్యమే మానవత్వమునకు శోభనందించును. ----- శ్రీ రామ చంద్రుడు. 
    • ఆత్మ త్రృప్తిలేక చేసుకొన్న అన్యత్రృప్తులు అల్పత్రృప్తులే కదా? 
    • మట్టిలో మాణిక్యము లభించినటుల, మాంసపు దేహములో దేహిలభించుచున్నాడు. దేహి నిమిత్తము దేహము కానీ, దేహము నిమిత్తము దేహి రాడు.------ శ్రీ రామ చంద్రుడు.
    • పరమలక్ష్యము నిమిత్తం కాయము కానీ, లక్ష్యమును వీడిన కాయము బొగ్గుతో సమానము.  యెట్టి వారికైననూ ఆత్మ తత్వము తెలియనంత వరకే కాయముపై భ్రాంతి. దేహభ్రాంతి అజ్ఞానము. ఆత్మ భ్రాంతి జ్ఞానము. ---- శ్రీ రామ చంద్రుడు. 
    • I don't believe in costliest things. I believe in valuable things. I don't believe in greatness. I believe in usefulness and utility of it. ---- Master EK.
    • అగ్ని సకల జీవుల హ్రృదయములలోవుండును. మనోవికారములు పుట్టిన యెడల వానిని దహించును. ----- శ్రీ రామ చంద్రుడు. 
    • దానమిచ్చుచూ, యజ్ఞార్థకర్మ నిర్వర్తించుచూ లోకహితుడగుచున్నకొలదీ జీవుడు ఊర్ధ్వ ముఖుడగును. స్వలాభమునకై ధనమును కూడబెట్టుచు పాము వలే పోట్టమీద ప్రాకుచూ ఎల్లప్పుడూ పొట్టకూటికై ప్రాకులాడువాడు అధోముఖుడగును. 
    • Saturn will not allow the living beings to go beyond law of nature. The power of offering freedom to mankind when they become matured enough to behave better is done by lord Saturn. 
    • The attitude to possess things or persons is an emotion but not love at all. ----- Master EK.
    •  Jupiter is authorised to offer --- Power of discrimination, Power of understanding, Power of arranging things in proper order so that an iron piece becomes magnet, also an ordinary person becomes a divine person. 
    • తపస్సే అన్ని సాధనలకు ఆధారము. ---- Penance is the most dependable one among all.
    • క్రృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీ కృష్ణుడు స్వయముగా పుట్టుక చేతనే భగవంతుడు.
    • లేని శుభము వచ్చుట యోగము. వచ్చిన శుభము తగ్గకుండుట క్షేమము. అనన్య చింతనతో నన్ను ధ్యానము చేయువారికి ఈ రెండును సిద్ధము. ----- శ్రీ కృష్ణుడు. 
    • నాయకుడు తాను ఆచరించక, లోకులను ఆచరించమనుటలో నాయకత్వమునకు అర్హుడు కాలేడు. అట్టి అనర్హుడైన నాయకుడు ఎప్పుడు తయారగునో అప్పుడే ధర్మనాశనము, అన్యాయ అభివృద్ధి ప్రారంభమగును. ---- శ్రీ రామ చంద్రుడు. 
    • ఏ శ్వాస దేహమునకాధారమో, ఆ శ్వాస యే ప్రాణాయామ మార్గమున జీవునికి రెక్కలుగామారి ఆత్మ సాక్షాత్కారమునకు దారి తీస్తుంది. ---- Master meditations. 
    • మనస్సు నిలువకున్న మహిముక్తి లేదయా. When mind is not kept calm, there is no self realisation on the face of the earth. --- Vemana Yogi.
    • విధులు జీవన్ముక్తులు. By doing our duty, we can be away from bondages. ---- Thyagaraja Swamy.
    • దానము చేయకనే మనుజులు దరిద్రులయ్యేరు. ----- శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి.
    • Money comes and goes but morality comes and grows. ---- Sree Satya Sai Baba. 
    • అవశ్యం భోక్తవ్యం క్రృతం కర్మ శుభాశుభం ---- సామాన్యం గా మనం చేసుకున్న శుభాశుభకర్మల ఫలితాలు మనల్ని విడిచిపెట్టవు. కానీ, పరమగురువును ఆశ్రయించి, వారి మార్గం లో సమర్పణబుద్ధితో నడిచేవారు అట్టి ఫలితాల నుండి విముక్తి చెందగలరు. 
    • పరమాత్ముని యందు అత్యంత ప్రేమ కలిగి యుండుటే భక్తి. అట్టి భక్తునకే నేను ప్రసన్నుడనగుదును. భక్తులకు నాప్రేమను, సుఖమును అందింతును. భక్తి స్వతంత్రము. పరాధీనము కాదు. జ్ఞానవిజ్ఞానములు దాని అధీనములు. నిరుపమానమగు సుఖమునకు భక్తి మూలము. సత్పురుషుల కటాక్షమే ఈ భక్తి భావములు కలుగుటకు ఆధారము. ఈ మార్గముననే జీవులు నన్ను త్వరగా చేరగలరు. ----- శ్రీ రామ చంద్రుడు. 
    • ఎపుడు జీవుడు తనకును పరమాత్మకు భేదము లేదనియూ, పరమాత్మ యొక్క ప్రతిబింబమే తాననియు గ్రహించునో అపుడు జీవుని మాయ విడిచి పోవును. అదియే ఆత్మ జ్ఞానము. ----- శ్రీ రామ చంద్రుడు. 
    • జీవుడు  తనకును, మాయకును, పరమాత్మకును గల సంబంధమును యెంత వరకు తెలిసికొనలేడో అంతవరకు జీవుడు జీవుడుగానే వుండును. ---- శ్రీ రామ చంద్రుడు.
    • అపరిగ్రహం అభివృద్ధిని కలిగిస్తుంది. ----- Non acceptance of donations from others gives development of the self. ----- Master EK. 
    • The person who behave with out ignorance ( Tamo Guna) in the life, is entitled to have the darshan of the lord (antaryami who is having Aditya varnam, a great light like our sunlight.) . For the remaining people, it is not possible to get self-realization.
    • We are at a challenging situation before the nature that whether we can live like a human being ( 1 to 1 relationship) or like a beast ( 1 to many relationship). Those who succeed in this test would be promoted to next higher level of existence. 
    • Thoughts can be managed through regular silent sitting. ----- Sree Satya Sai Baba. 
    • This birth is given to us to understand the right relationships and love the people around us as the forms of God. If we don't follow this, our existence on this earth would be wasted.
    • The one which is not there in the creation will not be there forever. The one which is already there in the creation will not be lost forever. Good people can understand this. ---- Bhagavad-Gita. 
    • Christianity, instead of speaking about Christ, it speaks more of itself. Hinduism, instead of speaking about Bhagavad-Gita, it speaks more of itself. We must understand this and let's not deviate from right path. ---- Madam Blavatsky, Master EK.
    • జీవుడు బ్రహ్మచర్య నియమము వలన ఊర్ధ్వ రేతస్కుడైనపుడు శరీరమున ప్రాణశక్తి  పుష్టికరమై ప్రవహించును. సమస్త నాడులు, గ్రంథులు స్రవించును. కుండలినీ శక్తి వలన వివిధ వాయిద్యాలు రాగయుక్తమైన గానంగా వినిపించగలవు. జీవుడు దేహమున దివ్యానుభూతులను చెందును. 
    • బాహ్య ప్రపంచ ప్రేరేపణముచే జరుగుతున్న ప్రవ్రృత్తియంతయూ తన్ను బంధించు కర్మ యగుచున్నది. అంతర్ముఖమైన ప్రజ్ఞ చే ప్రేరేపింపబడు సమస్త కర్మాచరణము కర్మబంధవిమోచకమై మానవుని ముక్తస్థితిలో నుంచుచున్నది. ----- Master EK.
    • మానవుని జీవిత ప్రవర్తనమునకు బాహ్య వస్తువులును, వాతావరణమును కారణము కారాదు. ----- Master EK.
    • Daana --means Charity. We have to do charity on daily basis (atleast before we take our food). Example, we may provide jaggery to ants in the morning after puja., We may offer food grains like rice, green dal, cooked rice to birds or dogs. This inculcate the quality of compassion in us, which is a most important quality for human beings.
    • Tapas -- means penance. It is a 3 fold procedure to be followed with determination ( mental, oral and physical) to complete a right task. 
    • Yagna means an activity to be performed on daily basis for the benefit of others without expecting anything in return. It should be done along with our duty.
    • బుద్ధిలో లీనమైన మనస్సు యొక్క మౌనమే సహజమైన మౌనము. ----Master EK. 
    • కామసంకల్పములు మనస్సున పుట్టి, ఇంద్రియముల ద్వారమున బయటికి వర్తించును. తద్వారా సంసారబంధనము కల్గును. మనస్సు బుద్ధికి ఉన్ముఖమగుటవలన మనోసంకల్పములు పరిహరింపబడును. అప్పుడు కనిపించునదంతయూ సంసారముగ వర్తించుట మాని తానుగా ( ఆత్మగా) వర్తించు ను. ఈ అనుభవం చెందుతున్న వాడు తనయందు తాను సంతుష్టుడగును. అతడే స్థితప్రజ్ఞుడు. తక్కిన వారి సంతుష్టికి ఒక బాహ్య కారణం కావలెను. ----- Master EK.
    • Dissatisfaction is a mental disease. ---- Master EK. 
    • Obstacle mindedness is a mental disease. ----- Master EK.
    • సత్యాన్నాస్తి పరోధర్మః ---- There is no dharma higher than truth. 
    • Night 0 hrs prayer is the best one. This is why because,  during that time all the planets pointing towards earth.---- Master CVV. 
    • I am in you. You do my work ( yoga practice). I will take care of your work. ---- Master CVV.
    • Environment is the product of our mind. Hence, make sure that our environment to be good so that our mind would be good.
    • ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము హితములతో కూడిన సత్యభాషణము, వేదాధ్యయనమొనర్చుటయు వాచకతపస్సు యని చెప్పబడును. --- భగవద్గీత. 
    • తమోగుణమును జయించుటకు duty నందు time punctuality  తప్పక పాటించాలి
    • ఉపాధి భేదమును వీడి ఉపాసన చేయవలెను. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు మార్గము. 
    • We are what we think. All that we are arises with our thoughts. With our thoughts, we make the world. The mind is everything. What you think you become. ---- Lord Budha. 
    • Do not dwell in the past, do not dream of the future, concentrate the mind on the present moment. ---- Lord Budha.
    • Help yourself, help others too. Seek not help as far as possible. This is a commandment. --- Master Kuthoomi. 
    • Faith is God. ----- Lord Jesus Christ.
    • Be fearless. ----- Essence of Bhagavad-Gita.
    • Practicing peace is but living in peace and this is where man processes the wealth of no want. ------ Master EK. 
    • If you expect anything from others, be prepared to be called a beggar. -------- Master EK.
    • సంస్కారమును బట్టి భోగము వచ్చును.
    • సుఖస్యమూలం ధర్మః --- సుఖపడుటకు మూలం ధర్మాచరణమే. 
    • Brahma Vidya is not a thing to be learnt or possessed. One should do Sadhana and get disciplined by selling themselves away permanently to it, then only this can be known by them.
    • kama = desire to attached to one thing that is not required.
      Krodha= anger
      Lobha= temptation to possess that what is not ours.
      Moha= mistaking one thing to another.
      Mada = indifference (pride)
      Maatsarya = malice = feeling unhappy to see anyone happy. 
            When we have kama, krodha, lobha, moha, mada, maatsarya in us while behaving with others,             we become incapable of receiving sufficient prana sakthi into our body from the nature around us.
    • Disease does not lie on physical body. Disease exist in the mind of the person and it's results reflect on the physical body. When the mind becomes pure, there would be no disease on physical body. వ్యాధి అనేది మానవుని యందు వుంటుంది, దానివలన శరీరానికి వ్యాధితమగుస్థితి వస్తుంది. ---- Master EK. 
    • వ్యాధి దేహము నందు వుంటుందనే unscientific విషయాన్ని మొట్టమొదటిసారిగా తుడిచేసినవాడు హోమియోపతి పితామహుడు Dr. Samuel hanimon. ------  Master EK.
    • యోగశాస్త్రం + ఆయుర్వేదం + హోమియోపతి = నూతన సనాతన ధర్మశాస్త్రం అవుతుంది. ---- Master EK.
    • When there is deficit of prana sakthi in us, We feel ill-health. Our mis -behaviour with the environment is only the root cause of not acquiring plenty of prana sakthi into our body. We should not forget this to re-establish our health and need to behave better with the environment. ----- Master EK.
    • To behave better, we should leave our seriousness(idea of differentiating ourselves and others). Then only we can come to our natural state. Through this only we can re-establish our health. ----Master EK.
    • Knowledge is not our strength. What we do is our strength. ----- Master EK.
    • నిశ్చయాత్మక బుద్ధి స్థిరంగా ఉంటుంది. స్థిరసంకల్పం లేనివారి ఆలోచనలు పరిపరి విధాల పరుగులెడతాయి.----- భగవద్గీత.
    • All are one, my dear son and be alike to everyone" ---- First message received by Jesus from the space.
    • God made man in HIS own image and likeness. ----- Holy Bible. 
    • Our education lies in our behaviour towards others. ---- Master EK. 
    • You can be deemed to have been given the first initiation, if only the question "How will my future be?" doesn't arise in your mind. ---- Master EK.
    • Health is the greatest gift, contentment the greatest wealth, faithfulness the best relationship.----- Lord Budha.
    • Those who plan to trouble others, will be put in to troubles as per the law of nature. పరులకు హాని చేయగోరువారు తామే చెడిపోదురు. ---- మిత్రలాభం.
    • You would be lifted up if and only if you extend your hand to lift some one who are in need. Otherwise not. ---- Master EK. 
    • To clear past karma, do Selfless service to humanity along with daily practice of meditation as given by Master.
    • त्वमेव माता च पिता  त्वमेव 

      त्वमेव बन्धुश्चा सखा त्वमेव

      त्वमेव विद्या द्रविणं त्वमेव

      त्वमेव सर्वं मम देव देव  
    • Meaning: O! Supreme Lord, only you are my mother, father, relative and friend. You are only my knowledge and wealth.  You are my everything. 
    • ఇంద్రియ నిగ్రహం లేనివాడు పశువుగా మారిపోతున్నాడు. ఇంద్రియ నిగ్రహం గలవాడు పశుపతిగ మారుతున్నాడు. మనలో ద్వంద్వ భావం పోనంత వరకు ఇంద్రియ నిగ్రహం కలిగి వుండటం అసాధ్యం. నేను-నీవు వేరువేరు అనే బేధభావం, ద్వంద్వ భావం నశించనంత వరకు ఇంద్రియ నిగ్రహం సాధించడం అసాధ్యం. అందరియందూ వున్న దైవము ఒక్కడే అనే భావం మనలో స్థిరపడే వరకు మనం వ్యక్తులతో కాక వారియందున్న అంతరాత్మతో మాట్లాడటం నేర్చుకుంటే ఇది సాధ్యమవుతుంది. ----- భగవాన్ శ్రీ సత్య సాయి బాబా.
    • The path is simple. The solution is simple. The answer is simple. But mind is not simple for the human beings. Though it is simple, we are not in a habit of keeping it simple. As we know the art of making it difficulty, the mind is not simple. ---- Master EK.
    • Program అనేది మన పరిసర ప్రాంతాల్లోని సజీవ విగ్రహరూపములలో వున్న వాసుదేవుడు నిర్వహణం చేస్తుంటాడనేది సత్యమైవున్నది. ఇది నమ్మినవాడికి వాడికంటూ ఒక ప్రత్యేకమైన program వుండదు. ------ Master EK.
    • వ్యయసాయం ఉత్తమం. వ్యాపారం మధ్యమం. ఉద్యోగం అధమం అన్నారు మన పెద్దలు. 
    • స్వభావం మారితే స్వరూపం కూడా మారుతుంది. బెల్లం స్వభావం తీయదనం. దాని స్వభావం మారితే దాని స్వరూపం కూడా మారుతుంది. అపుడు దానిని బెల్లం అనలేము కదా!!  అట్లే మానవుని స్వభావము మారితే ఆతని స్వరూపం కూడా మారుతుంది.-- భగవాన్ శ్రీ సత్యసాయి బాబా.
    • మనసును అదుపు చేయడమంటే మంచి పనులను చేయడంలో నిమగ్నం కావడమే. Mind control is nothing but merging the mind in right actions. --- Master EK.
    • Avoid an unconstrained talk about others in their absence. Then only you would be called as educated, otherwise not. ---- Master EK. 
    • Pray, Serve, Seek not personal favors. This triple function is called Prayer ---- Master CVV
    • Every one while speaking of others, speaks of himself.
       మిమ్మల్ని గురించి ఇతరులకు నేను ఏమి చెప్పానో దాని వలన మిమ్మల్ని గురించి తెలియదు. నేను ఎలాంటి వాడినో తెలుస్తుంది. ఇది ఒక మహా వాక్యం. ఈ వాక్యమును గూర్చి తపస్సు చేస్తున్న కొలదీ దాని సత్యత్వం క్రమేపీ బోధపడుతుంది. దీనివలన యోగసాధకుడికి అర్హత పెరుగుతుంది. ---- Master EK.
    • Selfless service is higher than power of understanding new things and power of inventing new things. ---- Master EK. 
    • మనలో అహంకారం (individuality )  వున్నంతవరకు రజోగుణ దోషం నశించదు. దీనివలన చేసిన తప్పులే మరలా మరలా చేస్తుంటాము. మనలో misunderstanding వున్నంతకాలం తమోగుణ దోషం నశించదు. దీనివలన ఒకోసారి చాలా కాలం నుంచి చేస్తున్న మంచి పనులను కూడా వదిలి పెట్టేస్తుంటాము. కావున ప్రతి రోజూ అప్రయత్నంగా ఒక సత్కర్మ నిర్వహణకై కాలనియమాన్ని పాటించడం వల్ల క్రమేణా రజస్తమోగుణములు సామ్యస్థితికి వచ్చి జీవితం ఒడిదుడుకులు లేకుండా సవ్యంగా సాగుతుంది. ---- Master EK. 
    • Cure earth by food. Cure water by drink. Cure fire by heat. Cure air by breath. Cure sound by thought. Cure mind by truth. Cure is complete.----April 15th meditation, Master EK. 
    • The Master Morya once said that it is impossible to make progress on the occult Path without a sense of humour, and certainly all the Adepts whom I have seen have possessed that qualification.
    • Meeting of man and God must be the goal. ---- Sree Aravinda Yogi. To explain that, he wrote 2 books--- Essays on yoga, Life divine.
      ఓంకారం ఉచ్ఛరించునపుడు, మనకు ఓంకారం ఉచ్ఛరించవలెనను సంకల్పం కలగడం, ఉఛ్ఛైస్వరముతో ఉచ్ఛరించగలగడం, ఉచ్ఛరిస్తూ ఆశబ్దాన్ని వినగలగడం----- ఈ process జరుగతూవున్నంతసేపు ( ఆ క్షణాలు మాత్రమే) మాత్రమే ఇది చేస్తున్నమానవుడు దేవునితో కలిసి వున్న పవిత్ర సమయం అవుతుంది. తద్వారా ఆతని శరీరం, ఇంద్రియాలు, మనస్సు పవిత్ర మౌతాయి. 
      ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మ.
      తస్య వాచకః ప్రణవః. ------- Master EK. 
    • క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామ్రృష్టః పురుషవిశేషః ఈశ్వరః.  ఇదియే ఈశ్వర శబ్దమునకు సరైన నిర్వచనం.
      మనలో వుంటూ క్లేశమునకు, కర్మలకు, తద్వారా వచ్చిన విపాకములకు (consequences),ఆశయములకు అంటబడక విశేషమైన పురుషుడుగ, సర్వజీవులకూ ఆధారభూతుడుగా వుండేవాడిని ఈశ్వరుడు అందురు. 
    • మాకు ఇది కావాలి, మా కష్టాలు పోవాలనే ఉద్దేశంతో దేవుని గురించి తపస్సు చేస్తుంటే దేవుడు వారి దరిజేరడు. తమ ఆజ్ఞ ఏమి స్వామి? తమను ఏవిధంగా సేవించుకో గలను అనే బ్రహ్మదేవుని మనస్తత్వం వున్నవారిదగ్గరకు దేవుడు స్వయంగా తానే వచ్చి వారిని అనుగ్రహించును. ------- భాగవతం, మాస్టర్ ఇకె
    • The beauty of life depends upon our good habits ----- Bhagwan Sree Satya Sai Baba.
    • Our behaviour will be distorted and conditioned according to the presence of people around us. Our behaviour changes with the persons present around us and the nature of persons around us will alter the nature of our existence. This is the cause of all diseases in its true sense. When man begins to live in confusion, hurry and always feeling that his time is not enough for his daily routine then he gradually goes into disease and this is what we call opposite of yoga. ---- Master EK.
    • స్రృష్ఠియందలి సద్గుణమూర్తియు, సద్గుణ సంస్థాపకుడునగు సత్యముగా దైవమును ధ్యానించుటొక్కటే బ్రహ్మ నేర్పిన మార్గం. ----- Master EK
    • తండ్రికి ఎవరు భక్తితో నమస్కరించి, అతడు తనకు స్రృష్ఠికర్తగా భావించి, పూజించునో, అట్టి పుత్రుని యందు బ్రహ్మత్వము, భక్తియోగం సిద్ధించును. చతుర్ముఖ బ్రహ్మ దీనిని స్థాపించిన కారణముననే లోకమందలి జీవులు నమస్కారములు అందుకొనుచున్నాడు. -----Master EK.
    • దైవమును స్మరించి కీర్తనం చేస్తే, పదిమందికి వివరిస్తే ఆత్మ వికాసం, పరిస్థితులపై, పరిసరములపై ధర్మాధికారము, కర్మబంధచ్ఛేదము కలుగుతాయి. -------- Master EK. 
    • సత్యశుభదాయకుడు, ధర్మవిస్తారకుడు గా దైవము వుండునని పురాణాలు భగవంతుని గూర్చి నిర్వచించాయి.------Master EK 
    • యోగసాధనకు అతిముఖ్యమైనవి----- ప్రణవోపాసనము( తస్య వాచకః ప్రణవః), ఈశ్వర ప్రణిధానము, తత్జపత్ తదర్థభావనమనే మూడు సూత్రాలు.------- Master EK.
    • యోగాభ్యాసములో మనస్సును ఉచ్ఛ్వాస, నిశ్వాస ల మీదనే లగ్నం చేయాలి. ఇది కాకుండా వేరే దేనిమీద లగ్నం చేసినా చిత్తవృత్తి నిరోధం జరుగక మీ ఉచ్ఛ్వాస నిశ్వాస ములే మీకు అడ్డు పడుతుంటాయి.  ------- Master EK. 
    • మనం ఇతరులకు అపకారం చేయకుండా, మనపని మనం చేసుకుంటున్నపుడు మనప్రస్తుత అవతారం చూసి ఇతరులు ఏమనుకుంటారో అనే న్యూనతా భావం పోవాలి. అప్పుడే వారు యోగాభ్యాసము నకు పనికి వస్తారు. ----- Master EK. 
    • దౌర్మనస్యం ( వ్యక్తుల పై గానీ, విషయాలపై గానీ దిగులు, వ్యామోహం, బెంగ వుండటం) వున్నవాడు యోగాభ్యాసము నకు పనికి రాడు. ---- Master EK. 
    • అంగమేజత్వము (ధ్యానం లో కూర్చుని వున్నప్పుడు నడుము వంగి కూర్చోవడం, శరీరభాగాలు కదులుతూ వుండటం, తలనొప్పి, వళ్ళునొప్పులు మొదలగునవి) వుండరాదు. అలావున్నచో చిత్తవిక్షేపం కలగడం వలన యోగాభ్యాసమునకు పనికిరాదు. దీనిని సవరించుటకు ప్రతి రోజూ ఒకే సమయానికి వ్యాయామం, ఆసనాలు, నడక మొదలగునవి ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన శరీరం ఉత్సాహంగా వుండి యోగసాధన సుగమం అవుతుంది. ------- Master EK. 
    • You are the creator of your own destiny. ---- Swamy Vivekananda. 
    • ఇతరులు మనకు ఏది చేస్తే మనకు అప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయరాదు. ఇతరులు మనకు ఏది చేస్తే మనకు ప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయదగును. దీనినే ధర్మం అంటారు. --------- విదురుడు.
    • Making promise to the Master and behaving accordingly (anustaanamu)  with out fail is essentially required to come up in life.
    • వస్త్రమున ఏవాసనగల వస్తువు నుంచి బంధించిన, ఆ వాసన వస్త్రమునకంటును. అట్లే తలచిన వస్తువుల కర్మవాసనలు మనస్సునకంటి సంగములగును. వస్త్రమున నిప్పుకణికనుంచి బంధించినచో దానివాసన వస్త్రమునకంటక, వస్త్రముకాలి‌ నిప్పులో లీనమగును. అట్లే మనస్సును వాయువులతో లయము చేసి సంకల్పంతో బంధించినచో, మనస్సునకు సంకల్పవాసనలంటక మనస్సు బుద్ధి లోనికి మాయమగును. ----- Master EK,  భాగవత ద్వితీయ స్కంధము.
    • యోగియైనవాడు ఏవిషయముననూ ఎవరినీ ద్వేషింపడు. దేనినీ ఇది కావలెనని కాంక్షింపడు. దేనికి నీ శోకింపడు. ఎవరినీ ఎప్పుడూ ఆశ్రయింపడు. నిత్య త్రృప్తుడై వుంటాడు. ----- Master EK.
    • You will know yourself better through astrology than any other subjects. ----- Master EK 
    • Prayer is an invocation to meditation. What a piano is to a musician, prayer is to you to get into the meditation. If you say that you are concentrating, that means you are not concentrating. When you engage your mind to carry out a good work or service, and if you forget that you are working or serving others, that state is called concentration. Similarly, if you say that you are sleeping, this means you are not sleeping at all. Sleeping is a state which can be understood once you get up from sleep. ----- Master EK. 
    • ఈర్ష్యా ళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి ---- ఈ 6గురు మాత్రమే దుఃఖభాగులు.---- మిత్రలాభం. 
    • The wealth which is earned through wrong means will not be useful for the right ones. ----- Vudura 
    • పరమప్రేమ రూపమున గొంతెత్తి దైవ సంకీర్తనముచేయు విద్య వలన పరిసరములన్నియూ దైవతత్వముచే ప్రభావితములగును. నాదములేని ధ్యానాదులకు బాహ్య వస్తువులను ప్రభావితం చేయుశక్తి లేదు. ----Master EK, Bhagavatamu.
    • LAWS OF NATURE

      The food we eat, has to be digested and then thrown out of body in 24 hours, else we will fall ill.
      The water we drink, gets in our body and is thrown out in 4 hours, else we will fall ill.
      The air we breathe, has to be thrown out in 1 minute, else we will die.
      What about negative emotions like hatred, anger, jealousy, insecurity ...  we hold in our body for days, months and years.
      If these negative emotions are not thrown out regularly it props up into psycho-somatic diseases.
      Meditation, prayers and above all an attitude of goodwill are safest way to dissolve these emotions.

      Stay blessed .
    • నేను వేరు, ఇతరులు వేరు అనే ద్వంద్వభావం మనలో వున్నంత వరకు మనం అజ్ఞానం లో వున్నట్లే. ఈ మోహమనే తమోగుణం దాటితే గానీ మోక్షం (ఆత్మ సాక్షాత్కార జ్ఞానము) కలుగదు. కావున మోక్షమునకు ప్రతిబంధకం మన అజ్ఞానమే. ---- మాస్టర్ ఇకె. 
    • మద్భక్తాయత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద. -- శ్రీ విష్ణు భగవానుడు నారద మహర్షితో ఇట్లు తన సమాధానమును తెలిపెను. అది ఏమనగా-- ఓ నారదా నాభక్తులు ఎక్కడ నా నామసంకీర్తనము గావించు చుందురో అచ్చట నేను ప్రత్యేకంగా కొలువై వుందును. కలియుగంలో కేశవనామసంకీర్తనము శ్రేష్ఠమైనది. కలౌసంకీర్ త్యకేశవమ్.
    • యోగస్థః కురుకర్మాణి ---- యోగస్థుడవై కర్మలను (చేయవలసినవి, చేయదగిన పరోపకార కర్మలు) ఆచరించవలెను. భగవంతునికి ప్రీతికరమైన కర్మలను భక్తితో ను, సమర్పణబుద్దితోను ఆచరించడం మే యోగము. యోగస్థుడవై అనగా అట్టి యోగమును అవలంబించిన వాడవై కర్మలను ఆచరించాలి. ----- భగవద్గీత, Explanation given by Master EK. 
    • చిత్తవ్రృత్తి నిరోధమునకు ముందుగా మనకు వున్న క్లేశములను విడిచి పెట్టవలెను. ఆ క్లేశములు 3 విధములు. 
      1. అవిద్య 2. అస్మిత 3. రాగము.
      అవిద్య అనగా ఈ స్రృష్ఠి మొత్తంలో మనం భాగంగా వున్నా, సృష్టి కన్నా వేరు వేరుగా ప్రత్యేకంగా మనల్ని మనం గుర్తుంచుకొని ప్రవర్తించడం.
      అస్మిత అనగా అహంకారం కలిగి ఉండటం. మీ అభిప్రాయం మీదే, నా అభిప్రాయం నాదే యనే తత్వంలో వుండటం.
      రాగము అనగా self proposed agreeable environment. రోజూ సుఖపడే పద్ధతిని అలవాటు చేసుకొని, దానికి విరుద్ధంగా ఎప్పుడైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు కలిగితే తట్టుకోలేక పోవటం.
      యోగ సాధకులు ఈ 3 రకాల క్లేశములను ముందుగా దాటాలి. ------ మాస్టర్ ఇకె.
    • It's the inefficiency of a person not to come up in the life. It's the responsibility of a person to understand his weakness and to rectify it at the earliest possible. Otherwise, he would be in the same position for years together with out any progress. No one can help him in this regard. But once he understood his present state of evolution and try to rectify his behaviour and follow the right direction with dedication, soon he will become rightly eligible to get a higher position. Once, you become rightly eligible, the result would be already there. ------ Master EK.
    • సామీప్యము-----> సారూప్యము---------> సాలోక్యము---------> సాయుజ్యము. This is the 4 fold way to realise God in us
    • ఉప్పు బొమ్మను సముద్రపు లోతును కొలవటానికి వుపయోగించినపుడు ఆ బొమ్మ సముద్రపు నీటిలో కరిగిపోయి అసలు బొమ్మ లేకుండా పోతుంది. అట్లే మనయందున్న పరమాత్మను భక్తి, ధ్యానములతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినపుడు మనోలయం జరిగి, నేనే పరమాత్మ అనే అనుభూతి కలిగి, మనోనిశ్చలత, నిత్యానందం కలిగి సర్వజీవులయందూ తననే దర్శించుకొనే లక్షణం కలిగి, తనవారు- ఇతరులు అనే బేధభావంపోయి, స్త్రీ పురుషులనే లింగభేదంపోయి, సర్వజీవులయందూ అకారణంగా పరమ ప్రేమను కలిగి జీవించగలిగే స్థితి వస్తుంది. ఓంకార ఉపాసన ఈ స్థితి పొందడానికి ముఖ్యంగా ఉపకరిస్తుంది. మాస్టర్ ఇకె గారు ఈ స్థితి పొందడానికి ఓంకార ఉపాసన ఎలా చేయాలి అనే విధానాన్ని పతంజలి యోగ సూత్రాలు ( audio files) లో చాలా వివరంగా ఇచ్చి యున్నారు.
    • యతోవాచానివర్తంతే అప్రాప్యమనసాసహ -- ఆ పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొనుటకు మనస్సు, వాక్కు సరిపోవు. ఆ అనుభూతి ఎవరికి వారే పొందవలసిందేగానీ మరియొక మార్గం లేదు. 
    • ఎదుటి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మనే దర్శించు వానిని ఎదుటి వ్యక్తిలోని రజోగుణముగాని, తమోగుణముగాని ఏమియును బాధింపలేవు. ఇంతకుమించి చేయవలసిన సాధనలేదు, లేదు, లేదు.
      -మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్య.
    • పరోపకారము చేయుట, చేసినవాని మనస్సు బాగుపడుటకు గాని పరుని ఉపకారమునకు కాదు.
      -మాస్టర్ ఇ.కె.
    • సాధన ఎన్నాళ్ళు అంటే, ఎన్నాళ్ళు అన్న ప్రశ్న తొలగిపోవు వరకు. ఆపైన ఎట్లాగు సాధన ఆగదు.
      -మాస్టర్ ఇ.కె.
    • మన సాధన అందరికి తెలియాలని తాపత్రయ పడరాదు. తెలియకుండా జరిగితేనే మంచిదికూడ.
      -మాస్టర్ ఇ.కె.
    • సర్వవిధముల విచారింపక యేపనియు చేయరాదు. సర్వవిధముల విచారించి చేసిన పనికి ఎన్నటికీ హాని కలుగదు. ------ మిత్రలాభము. 
    • సేవకావ్రృత్తిచే లభించు పాయసాన్నము కంటే స్వచ్ఛంధవ్రృత్తిచే లభించు గంజి మేలు. కావున ప్రాప్తలాభముచే త్రృప్తిపడి సుఖమందుము. ----- చిన్నయసూరి.
    • పరిమళాలు మోయు గాడిద ఏనుగగునా? అట్లే ఎన్ని విద్యలు నేర్చిననూ నీచుడు ఉత్తముడు కాలేడు.
    • ఎలుకతోలును పట్టి ఏడాది ఉతికినా తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి ఎంతకొట్టినా పలుకదు కదా! అట్లే అల్పుని మనస్సు మారదు.
    • వేరుపురుగు వ్రృక్షమును, చీడపురుగు చెట్టును పాడుచేయునట్లు దుర్మార్గుడు గుణవంతుని చెరచును.
    • తనుచేసే పనిలో పదిమందికి పనికివచ్చేది ఉండి, వ్యక్తిగతమైనది ఉండదో అట్టివాణ్ణి ద్విజుడు అంటారు.
      -మాస్టర్ ఇ.కె.
    • Courage, Discrimination, Purity of mind, Quietude --- are inborn qualities of an aspirant standing at the door step of initiation for discipleship. ---- Master EK. 
    • బ్రహ్మచర్యపాలనము వలన సర్వజ్ఞత్వము సిద్ధించును. ----- Master EK.
    • The Bhagavad Gita asks you to be not Balavaan (possessor of physical prowess), not Dhanavaan (possessor of a comfortable bank balance) but, Atmavaan (having the prowess arising out of the awareness that you are the Atma, which can remain unaffected by fame or shame, grief or joy and all the buffetings of the dualities of the world).
    • The wealth you earn is not true wealth! True wealth is the grace of God.---- Sree Satya Sai baba.
    • కాయకు చెట్టే ఆధారంగానీ వేరొక కాయ కాదు కదా అట్లే ప్రతి వ్యక్తికీ భగవంతుడే ఆధారంగా వున్నాడు గానీ వేరొక వ్యక్తి గాదు. మానవులు ఒకరిపైనొకరు ప్రేమ, ఆప్యాయతలు కలిగి వుండవచ్చును గానీ దైవమును మరచి స్వప్రయోజనములకై ఒకరిపైనొకరు ఆధారపడి జీవించుట శ్రేయస్కరము కాదు.  ----- శ్రీ పోతన, భాగవతం.
    • మానవుని దుఃఖానికి కారణం తనని తాను మరచిపోయి ప్రవర్తించడం. దుఃఖనివ్రృత్తికి కారణం తనని తాను గుర్తించి ప్రవర్తించడమే. ఇది చాలా ముఖ్యమైన విషయం, కావున దీనిని ఎప్పుడూ మరచిపోకూడదు.
    • సర్వం ఖల్విదం బ్రహ్మ ---- ఈ కనబడునదంతయూ భగవంతుడే.
    • కామియైననూ, మోక్షగామియైననూ మానవుడు తనను తాను మరచిపోయి ప్రవర్తించరాదు. ---- మఛ్చీంద్ర యోగి
    • --------------------------------------------------------
    • 👌👌👌👌👌👌👌
          ఓ నాలుగు మంచి
                 మాటలు
      👌👌👌👌👌👌👌

      ఒకరిని బాధపెట్టడం నీటిలో రాయిని వేసినంత సులువు. కానీ వారిని తిరిగి మామూలు స్థితికి తీసుకరావడం నీటిలోంచి ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధపెట్టకుండా ఉందాం.
      🌸🌸🌸🌸🌸🌸🌸
      "మౌనం" - "మనస్సు"ని  శుద్ధి చేస్తుంది. "స్నానం" "దేహాన్ని" శుద్ధి చేస్తుంది. "ధ్యానం" - "బుద్ది"ని శుద్ధి చేస్తుంది. "ప్రార్థన"- "ఆత్మ"ను శుద్ధి చేస్తుంది.
            "దానం" - "సంపాదన"ను శుద్ధి చేస్తుంది. "ఉపవాసం"- "ఆరోగ్యాన్నీ" శుద్ది చేస్తుంది. అలాగే "క్షమాపణ" - "సంబంధాల"ను శుద్ది చేస్తుంది.
      🌺🌺🌺🌺🌺🌺🌺
      ఎవరితో అయినా సరే ఎంత వరకు ఉండాలో అంత వరకే ఉండాలి. అందరూ మనవాళ్ళే అని వాళ్ళమంచి కోసం ఏదైనా మంచి మాట చెబితే వాళ్ళ దృష్టిలో మనం చెడ్డ వాళ్ళం అవుతాం జాగ్రత్త.
      💐💐💐💐💐💐💐
      నీ గురించి పదిమంది గొప్పగా చెప్పుకోవాలంటే ముందు నీవు వందమంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి.
      🌷🌷🌷🌷🌷🌷🌷
      సత్యం వైపు నీవుండాలనుకుంటే ఒంటరిగా మహావృక్షంలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ పడిపోవాల్సివస్తే మళ్ళీ మొలకెత్తడానికి విత్తనంలాగా పడిపోవాలి.
      🌻🌻🌻🌻🌻🌻🌻
      జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. చాలానే చూడాల్సివస్తుంది. వాటన్నింటినీ ఎదుర్కొనే "ధైర్యం" ఉన్నప్పుడే జీవితం అర్ధవంతంగా ఉంటుంది. ఏ క్షణంలో అయితే మన పట్ల మనం నమ్మకాన్ని కోల్పోతామో ఆ క్షణం నుండే మనం చచ్చిన శవంతో సమానం.
      🌼🌼🌼🌼🌼🌼🌼
      కరుగుతున్న కాలానికీ, జరుగుతున్న సమయానికీ, అంతరించే వయసుకీ మిగలిపోయే జ్ఞాపకమే - "మంచితనం". అదే మనకు "ఆభరణం"...
      🌹🌹🌹🌹🌹🌹🌹
      "అదృష్టం" అంటే ధనం వస్తువులు ఉండడమే మాత్రమే కాదు,
            -   చేతినిండా పని ...
            -   కడుపునిండా తిండి.. 
            -   కంటినిండా నిద్ర...
            -   అవసరానికి ఆదుకునే
                ఆప్తులను
      కలిగి ఉండడమే అసలైన "అదృష్టం".
      🥀🥀🥀🥀🥀🥀🥀
      మనల్ని అర్ధం చేసుకుంటే గుండెల్లో గుడి కట్టినా తప్పులేదు. కానీ మనకే విలువ లేనిచోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్ధమే.
      🌳🌳🌳🌳🌳🌳🌳
      మనిషిలో "అహం" తగ్గిన రోజు "ఆప్యాయత" అంటే అర్ధం అవుతుంది. "గర్వం" పోయిన రోజు ఎదుటివారిని ఎలా "గౌరవించాలో" తెలుస్తుంది. "నేనే", "నాకేంటి !" అనుకుంటే చివరకు ఒక్కడిగానే ఉండాల్సివస్తుంది. "గౌరవమర్యాదలు" ఇచ్చిపుచ్చుకుంటూ అందరితో కలిసి ఆనందంగా జీవించడమే "మంచి జీవితం".
      🌴🌴🌴🌴🌴🌴🌴
      నిరంతరం వెలిగే సూర్యూణ్ణి చూసి "చీకటి" భయపడుతుంది. అలాగే నిత్యం కష్టపడే మనిషిని చూసి "ఓటమి" భయపడుతుంది. 
      🌲🌲🌲🌲🌲🌲🌲
      ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఒక "విలువ" ఉందని తెలుసుకో. అలాగే నీకన్నా తక్కువ స్థాయి వారిని చూసి ఆనందపడకు. పై స్థాయి వారిని  చూసి లక్ష్యమేర్పరచుకో.
      🌱🌱🌱🌱🌱🌱🌱
      నీవు ఈ ప్రపంచానికి అర్ధం కాకపోయినా బ్రతికేయవచ్చు. కానీ నీకు నువ్వే అర్ధం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు.
      🌿🌿🌿🌿🌿🌿🌿
       జీవితంలో "సంపాదన" పెరిగితే ధనవంతుడివి అవుతావు. "వయస్సు" పెరిగితే ముసలివాడివి అవుతావు. కానీ నీలో "మంచితనం" పెంచుకుంటే మంచి మనిషిగా కలకాలం మిగులుతావు.
    • ---------------------------------------------------

    No comments:

    Post a Comment