Wednesday 10 June 2020

72. Some Yoga Principles -2

* క్లేశ కర్మ విపాక ఆశయైః అపరామ్రృష్టః పురుషవిశేషః ఈశ్వరః.  ఇదియే ఈశ్వర శబ్దమునకు సరైన నిర్వచనం.
మనలో వుంటూ క్లేశమునకు, కర్మలకు, తద్వారా వచ్చిన విపాకములకు (consequences),ఆశయములకు అంటబడక విశేషమైన పురుషుడుగ, సర్వజీవులకూ ఆధారభూతుడుగా వుండేవాడిని ఈశ్వరుడు అందురు. 
* మాకు ఇది కావాలి, మా కష్టాలు పోవాలనే ఉద్దేశంతో దేవుని గురించి తపస్సు చేస్తుంటే దేవుడు వారి దరిజేరడు. తమ ఆజ్ఞ ఏమి స్వామి? తమను ఏవిధంగా సేవించుకో గలను అనే బ్రహ్మదేవుని మనస్తత్వం వున్నవారిదగ్గరకు దేవుడు స్వయంగా తానే వచ్చి వారిని అనుగ్రహించును.
* Our behaviour will be distorted and conditioned according to the presence of people around us. Our behaviour changes with the persons present around us and the nature of persons around us will alter the nature of our existence. This is the cause of all diseases in its true sense. When man begins to live in confusion, hurry and always feeling that his time is not enough for his daily routine then he gradually goes into disease and this is what we call opposite of yoga.

* స్రృష్ఠియందలి సద్గుణమూర్తియు, సద్గుణ సంస్థాపకుడునగు సత్యముగా దైవమును ధ్యానించుటొక్కటే బ్రహ్మ నేర్పిన మార్గం.
*తండ్రికి ఎవరు భక్తితో నమస్కరించి, అతడు తనకు స్రృష్ఠికర్తగా భావించి, పూజించునో, అట్టి పుత్రుని యందు బ్రహ్మత్వము, భక్తియోగం సిద్ధించును. చతుర్ముఖ బ్రహ్మ దీనిని స్థాపించిన కారణముననే లోకమందలి జీవులు నమస్కారములు అందుకొనుచున్నాడు.
* ఆత్మతృప్తిలేని అన్యతృప్తులు అల్పతృప్తులే.
* దైవమును స్మరించి కీర్తనం చేస్తే, పదిమందికి వివరిస్తే ఆత్మ వికాసం, పరిస్థితులపై, పరిసరములపై ధర్మాధికారము, కర్మబంధచ్ఛేదము కలుగుతాయి.
* సత్యశుభదాయకుడు, ధర్మవిస్తారకుడు గా దైవము వుండునని పురాణాలు భగవంతుని గూర్చి నిర్వచించాయి.
* యోగసాధనకు అతిముఖ్యమైనవి----- ప్రణవోపాసనము( తస్య వాచకః ప్రణవః), ఈశ్వర ప్రణిధానము, తత్జపత్ తదర్థభావనమనే మూడు సూత్రాలు.
* యోగాభ్యాసములో మనస్సును ఉచ్ఛ్వాస, నిశ్వాస ల మీదనే లగ్నం చేయాలి. ఇది కాకుండా వేరే దేనిమీద లగ్నం చేసినా చిత్తవృత్తి నిరోధం జరుగక మీ ఉచ్ఛ్వాస నిశ్వాస ములే మీకు అడ్డు పడుతుంటాయి.
* మనం ఇతరులకు అపకారం చేయకుండా, మనపని మనం చేసుకుంటున్నపుడు మనప్రస్తుత అవతారం చూసి ఇతరులు ఏమనుకుంటారో అనే న్యూనతా భావం పోవాలి. అప్పుడే వారు యోగాభ్యాసము నకు పనికి వస్తారు.
* దౌర్మనస్యం ( వ్యక్తుల పై గానీ, విషయాలపై గానీ దిగులు, వ్యామోహం, బెంగ వుండటం) వున్నవాడు యోగాభ్యాసము నకు పనికి రాడు.
* అంగమేజత్వము (ధ్యానం లో కూర్చుని వున్నప్పుడు నడుము వంగి కూర్చోవడం, శరీరభాగాలు కదులుతూ వుండటం, తలనొప్పి, వళ్ళునొప్పులు మొదలగునవి) వుండరాదు. అలావున్నచో చిత్తవిక్షేపం కలగడం వలన యోగాభ్యాసమునకు పనికిరాదు. దీనిని సవరించుటకు ప్రతి రోజూ ఒకే సమయానికి వ్యాయామం, ఆసనాలు, నడక మొదలగునవి ఏర్పాటు చేసుకోవాలి. దీనివలన శరీరం ఉత్సాహంగా వుండి యోగసాధన సుగమం అవుతుంది.
* You are the creator of your own destiny. ---- Swamy Vivekananda.

*ఇతరులు మనకు ఏది చేస్తే మనకు అప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయరాదు. ఇతరులు మనకు ఏది చేస్తే మనకు ప్రియముగ తలంతుమో దానిని మనం ఇతరులకు చేయదగును. దీనినే ధర్మం అంటారు. --------- విదురుడు.
* Making promise to the Master and behaving accordingly (anustaanamu)  with out fail is essentially required to come up in life.

* వస్త్రమున ఏవాసనగల వస్తువు నుంచి బంధించిన, ఆ వాసన వస్త్రమునకంటును. అట్లే తలచిన వస్తువుల కర్మవాసనలు మనస్సునకంటి సంగములగును. వస్త్రమున నిప్పుకణికనుంచి బంధించినచో దానివాసన వస్త్రమునకంటక, వస్త్రముకాలి‌ నిప్పులో లీనమగును. అట్లే మనస్సును వాయువులతో లయము చేసి సంకల్పంతో బంధించినచో, మనస్సునకు సంకల్పవాసనలంటక మనస్సు బుద్ధి లోనికి మాయమగును.
* యోగియైనవాడు ఏవిషయముననూ ఎవరినీ ద్వేషింపడు. దేనినీ ఇది కావలెనని కాంక్షింపడు. దేనికి నీ శోకింపడు. ఎవరినీ ఎప్పుడూ ఆశ్రయింపడు. నిత్య త్రృప్తుడై వుంటాడు.
* You will know yourself better through astrology than any other subject.

* Prayer is an invocation to meditation. What a piano is to a musician, prayer is to you to get into the meditation. If you say that you are concentrating, that means you are not concentrating. When you engage your mind to carry out a good work or service, and if you forget that you are working or serving others, that state is called concentration. Similarly, if you say that you are sleeping, this means you are not sleeping at all. Sleeping is a state which can be understood once you get up from sleep.

* ఈర్ష్యా ళువు, జుగుప్సావంతుడు, నిస్సంతోషి, క్రోధనుడు, నిత్యశంకితుడు, పరభాగ్యోపజీవి ---- ఈ 6గురు మాత్రమే దుఃఖభాగులు.
* The wealth which is earned through wrong means will not be useful for the right ones. ----- Vudura

*  SOME LAWS OF NATURE: (General)

The food we eat, has to be digested and then thrown out of body in 24 hours, else we will fall ill.
The water we drink, gets in our body and is thrown out in 4 hours, else we will fall ill.
The air we breathe, has to be thrown out in 1 minute, else we will die.
What about negative emotions like hatred, anger, jealousy, insecurity ...  we hold in our body for days, months and years.
If these negative emotions are not thrown out regularly it props up into psycho-somatic diseases.
Meditation, prayers and above all an attitude of goodwill are safest way to dissolve these emotions.

* నేను వేరు, ఇతరులు వేరు అనే ద్వంద్వభావం మనలో వున్నంత వరకు మనం అజ్ఞానం లో వున్నట్లే. ఈ మోహమనే తమోగుణం దాటితే గానీ మోక్షం (ఆత్మ సాక్షాత్కార జ్ఞానము) కలుగదు. కావున మోక్షమునకు ప్రతిబంధకం మన అజ్ఞానమే.
* From this moment avoid all bad habits, they don't contribute the least joy.
*Past is beyond recovery. Future you are not sure of. Given moment is now. So, do not delay in the path of right action.
* The problems are not as big as you think. There is nothing which can not be solved with a little patience.
* Good education results in one's mind to control the senses and to keep them in the right direction.

* మద్భక్తాయత్రగాయంతి తత్ర తిష్ఠామి నారద. -- శ్రీ విష్ణు భగవానుడు నారద మహర్షితో ఇట్లు తన సమాధానమును తెలిపెను. అది ఏమనగా-- ఓ నారదా నాభక్తులు ఎక్కడ నా నామసంకీర్తనము గావించు చుందురో అచ్చట నేను ప్రత్యేకంగా కొలువై వుందును. కలియుగంలో కేశవనామసంకీర్తనము శ్రేష్ఠమైనది. కలౌసంకీర్ త్యకేశవమ్.
* యోగస్థః కురుకర్మాణి ---- యోగస్థుడవై కర్మలను (చేయవలసినవి, చేయదగిన పరోపకార కర్మలు) ఆచరించవలెను. భగవంతునికి ప్రీతికరమైన కర్మలను భక్తితో ను, సమర్పణబుద్దితోను ఆచరించడం మే యోగము. యోగస్థుడవై అనగా అట్టి యోగమును అవలంబించిన వాడవై కర్మలను ఆచరించాలి.
* చిత్తవ్రృత్తి నిరోధమునకు ముందుగా మనకు వున్న క్లేశములను విడిచి పెట్టవలెను. ఆ క్లేశములు 3 విధములు. 
1. అవిద్య 2. అస్మిత 3. రాగము.
అవిద్య అనగా ఈ స్రృష్ఠి మొత్తంలో మనం భాగంగా వున్నా, సృష్టి కన్నా వేరు వేరుగా ప్రత్యేకంగా మనల్ని మనం గుర్తుంచుకొని ప్రవర్తించడం.
అస్మిత అనగా అహంకారం కలిగి ఉండటం. మీ అభిప్రాయం మీదే, నా అభిప్రాయం నాదే యనే తత్వంలో వుండటం.
రాగము అనగా self proposed agreeable environment. రోజూ సుఖపడే పద్ధతిని అలవాటు చేసుకొని, దానికి విరుద్ధంగా ఎప్పుడైనా ఇబ్బంది కలిగించే పరిస్థితులు కలిగితే తట్టుకోలేక పోవటం.
యోగ సాధకులు ఈ 3 రకాల క్లేశములను ముందుగా దాటాలి. 
* It's the inefficiency of a person not to come up in the life. It's the responsibility of a person to understand his weakness and to rectify it at the earliest possible. Otherwise, he would be in the same position for years together without any progress. No one can help him in this regard. But once he understood his present state of evolution and try to rectify his behaviour and follow the right direction with dedication, soon he will become rightly eligible to get a higher position. Once, you become rightly eligible, the result would be already there.

* సామీప్యము-----> సారూప్యము---------> సాలోక్యము---------> సాయుజ్యము. This is the 4 fold way to realise God in us.

* ఉప్పు బొమ్మను సముద్రపు లోతును కొలవటానికి వుపయోగించినపుడు ఆ బొమ్మ సముద్రపు నీటిలో కరిగిపోయి అసలు బొమ్మ లేకుండా పోతుంది. అట్లే మనయందున్న పరమాత్మను భక్తి, ధ్యానములతో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినపుడు మనోలయం జరిగి, నేనే పరమాత్మ అనే అనుభూతి కలిగి, మనోనిశ్చలత, నిత్యానందం కలిగి సర్వజీవులయందూ తననే దర్శించుకొనే లక్షణం కలిగి, తనవారు- ఇతరులు అనే బేధభావంపోయి, స్త్రీ పురుషులనే లింగభేదంపోయి, సర్వజీవులయందూ అకారణంగా పరమ ప్రేమను కలిగి జీవించగలిగే స్థితి వస్తుంది. ఓంకార ఉపాసన ఈ స్థితి పొందడానికి ముఖ్యంగా ఉపకరిస్తుంది. మాస్టర్ ఇకె గారు ఈ స్థితి పొందడానికి ఓంకార ఉపాసన ఎలా చేయాలి అనే విధానాన్ని పతంజలి యోగ సూత్రాలు ( audio files) లో చాలా వివరంగా ఇచ్చి యున్నారు.
* యతోవాచానివర్తంతే అప్రాప్యమనసాసహ -- ఆ పరబ్రహ్మమును గూర్చి తెలుసుకొనుటకు మనస్సు, వాక్కు సరిపోవు. ఆ అనుభూతి ఎవరికి వారే పొందవలసిందేగానీ మరియొక మార్గం లేదు.
* ఎదుటి ప్రతి వ్యక్తిలోనూ పరమాత్మనే దర్శించు వానిని ఎదుటి వ్యక్తిలోని రజోగుణముగాని, తమోగుణముగాని ఏమియును బాధింపలేవు. ఇంతకుమించి చేయవలసిన సాధనలేదు, లేదు, లేదు.
* పరోపకారము చేయుట, చేసినవాని మనస్సు బాగుపడుటకు గాని పరుని ఉపకారమునకు కాదు.
* సాధన ఎన్నాళ్ళు అంటే, ఎన్నాళ్ళు అన్న ప్రశ్న తొలగిపోవు వరకు. ఆపైన ఎట్లాగు సాధన ఆగదు.
* మన సాధన అందరికి తెలియాలని తాపత్రయ పడరాదు. తెలియకుండా జరిగితేనే మంచిదికూడ.
* సర్వవిధముల విచారింపక యేపనియు చేయరాదు. సర్వవిధముల విచారించి చేసిన పనికి ఎన్నటికీ హాని కలుగదు. ------ మిత్రలాభము.
* సేవకావ్రృత్తిచే లభించు పాయసాన్నము కంటే స్వచ్ఛంధవ్రృత్తిచే లభించు గంజి మేలు. కావున ప్రాప్తలాభముచే త్రృప్తిపడి సుఖమందుము. ----- చిన్నయసూరి.
* ఎలుకతోలును పట్టి ఏడాది ఉతికినా తెలుపు రాదు. కొయ్య బొమ్మను తెచ్చి ఎంతకొట్టినా పలుకదు కదా! అట్లే అల్పుని మనస్సు మారదు.
* పరిమళాలు మోయు గాడిద ఏనుగగునా? అట్లే ఎన్ని విద్యలు నేర్చిననూ నీచుడు ఉత్తముడు కాలేడు.
* వేరుపురుగు వ్రృక్షమును, చీడపురుగు చెట్టును పాడుచేయునట్లు దుర్మార్గుడు గుణవంతుని చెరచును.
* తనుచేసే పనిలో పదిమందికి పనికివచ్చేది ఉండి, వ్యక్తిగతమైనది ఉండదో అట్టివాణ్ణి ద్విజుడు అంటారు.
* Courage, Discrimination, Purity of mind, Quietude --- are inborn qualities of an aspirant standing at the door step of initiation for discipleship. ---- Master EK. 







No comments:

Post a Comment